వీబీజీ - రాంజీ పథకం పై మెట్ల కు అవగాహన కార్యక్రమం - మెట్లకు శిక్షణ కార్యక్రమం.:
సూర్య ముధోల్ మండలం.
మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం వీబీజీ - రాంజీ పథకం పై మెట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీవో శిరీష మాట్లాడుతూ ప్రతి మెట్లు 30 - 40 మంది కూలీలకు నియమించినట్లు తెలిపారు.ఉపాధి పనులపై అవగాహన కల్పించారు. కొలతల ప్రకారం పనులను చేయాలన్నారు. ప్రతిరోజు మస్టర్ రోల్ ను సక్రమంగా ఉండాలన్నారు. ఏలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా పనులను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు