*రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్
*రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్*
*సముద్రాల గ్రామ ఉపసర్పంచ్, ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా నాయకులు, చింతకింది సింగరయ్య*
కోహెడ మండలంలోని సముద్రాల గ్రామపంచాయతీ పరిధిలో ఇంద్ర నగర్ కాలనీ కమాన్ నుండి బ్రహ్మంగారి గుడి వరకు మట్టి రోడ్డుకు మొరంపోయుటకు గ్రామపంచాయతీలో ముందు తీర్మానం చేయాలి పని చేసిన తర్వాత తీర్మానం చేశారు. అలా నడవదు ఎన్ని ట్రాక్టర్ల మొరం కొట్టారు జెసిపి బ్లేడ్ బండ్లు ఎన్ని గంటలు పనిచేశాయనేది ఆధారాలతో చూపిస్తాను రెండు లక్షల రూపాయల పనికి నాలుగులక్షల రూపాయల పని చేశానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం దీనిని గ్రామ ప్రజలు గ్రహించాలని తెలియజేస్తున్నాను. గ్రామపంచాయతీల బాత్రూంలో వాటర్ సౌకర్యం లేదని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. వాటర్ సౌకర్యము కోసం ఉప సర్పంచ్ గా నేను మోటర్ తీసుకొచ్చి బాత్రూంలోకి నీళ్లు వచ్చే విధంగా కృషిచేశాను అధికారులకు మోటర్ తీసుకొచ్చివాటర్ సౌకర్యం కల్పించామని కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం గ్రామసభలో సర్పంచ్ సమాధానం చెప్పకుండా ఇతరులు సమాధానం చెప్పిన దాని పైన ఎలాంటి చర్యలు లేవు జియో లిస్ట్ సర్టిఫికెట్ లేకుండా బోర్లు వేశాడు వాటిపైన ఎలాంటి చర్యలు లేవు ఇంతవరకు జియాలజిస్ట్ సర్టిఫికెట్ చూపి ఇవ్వలేదు. జిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ పై విచారణ చేపట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. గ్రామంలో ఇంకా ప్రజలకు మంచినీటి సౌకర్యం అందడం లేదు అక్కడక్కడ గేటు వాళ్ళు వేసినచో ప్రజలకు మంచినీటి సౌకర్యము అందనున్నది గేట్ వాళ్లు వేయాలని ఎన్నిసార్లు చెప్పినా సర్పంచ్ కార్యదర్శి పట్టించుకోవడం లేదు వారానికి ఒక్కరోజైనా దళితవాడను కార్యదర్శి చూసిన దాఖలాలు లేవు సర్పంచ్ పాలకవర్గం కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్ట నుసారంగా వ్యవహరిస్తున్నాడు. గ్రామంలో ఏ పనిచేయకుండా ఉంటున్నాడు. ఇంద్ర నగర్ పాఠశాలలో నీటి సౌకర్యం లేక విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వెంటనే విచారణ చేపట్టాలని గ్రామ ఉపసర్పంచ్, ఉప సర్పంచ్ ఫోరం జిల్లా నాయకులు చింతకింది సింగరయ్య అధికారులను కోరుచున్నారు.