BREAKING
పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి కుందుర్పిలో పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.

విద్యుద్ఘాతంతో పాడి గేదె మృతి

Select Suryaa Now
విద్యుద్ఘాతంతో పాడి గేదె మృతి

 

మాడ్గులపల్లి,మేజర్ న్యూస్:

మండలం లోని అభంగాపురం గ్రామంలో విద్యుద్ఘాతానికి గురై పాడి గేదె మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితుడు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం అభంగాపురం గ్రామానికి చెందిన పగిడిపల్లి వీరయ్యకు చెందిన పాడి గేదె ఆదివారం గ్రామంలోని సుదర్శన్ రెడ్డి పొలం వద్ద మేతకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ప్రమాదవశాత్తు తెగి వేలాడుతున్న విద్యుత్తు తీగలు తగలడంతో గేదెకు విద్యుద్ఘాతం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.పాడి గేదె చనిపోవడంతో తనకు సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, కుటుంబానికి జీవన ఆధారం కోల్పోయామని బాధితుడు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్తు తీగలను సరిచేసి, ప్రభుత్వం, విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి తనకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వీరయ్య కోరుతున్నారు.