BREAKING
*గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే? ఈక్విటాస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా బాలాజీ నూతలపాటి వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం సోలార్ రంగంలో 'షోల్స్' సంస్థను కొనుగోలు చేసిన 'అరే టెక్నాలజీస్'

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్

Select Suryaa Now
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం టైసన్ నాయుడు. అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ వంటి సంచలన విజయాల తర్వాత దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్లు రాకపోవడంతో చిత్ర షూటింగ్ విషయమై వస్తున్న ఊహాగాణాలకు మేకర్స్ తాజాగా తెరదించారు. ఈ సినిమాకు సంబంధించి మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్, మొదటి పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీ పడని నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు హై-వోల్టేజ్ టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలోని మదరాసి రబ్బరు బొమ్మ అనే మాస్ ఫోక్ సాంగ్‌ను నవంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదొక పక్కా మాస్ బీట్‌తో సాగే జానపద గీతమని, శ్రోతలను ఉర్రూతలూగించేలా ఉంటుందని తెలుస్తోంది.

మాస్ పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ పాటపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో హీరోయిన్లు సంప్రదాయ జానపద ఆహార్యంలో ఎంతో కలర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ చిత్రంలో ప్రెజెంట్ చేస్తున్నారు. నవంబర్ 6న విడుదల కానున్న ఈ మాస్ ఫోక్ సాంగ్ యూట్యూబ్‌తో పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.