నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు
నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు
మునుగోడు,మేజర్ న్యూస్:నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ ల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ హెచ్చరించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 41 మంది బెల్ట్ షాపుల నిర్వాహకులను మునుగోడు తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని రూ.1,00,000 చొప్పున బైండోవర్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని వివిధ గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల ప్రజలు, ముఖ్యంగా యువత మద్యానికి అలవాటు పడుతున్నారని,దీంతో ప్రమాదాలు జరిగి, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ తెలిపారు. బెల్ట్ షాపు నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేయడం ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తామన్నారు.అనంతరం తహసీల్దార్ నెలపట్ల నరేష్ మాట్లాడుతూ
మండల పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా పోలీసులు నిరంతరం నిఘా పెట్టడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ, అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించారనీ పేర్కొన్నారు.
కె. ఇంద్రసేనారెడ్డి, మేజర్ న్యూస్, మునుగోడు, నల్గొండ