BREAKING
ఫోన్ ట్యాపింగ్ వివాదం: ఇండోనేషియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ తొలగింపు అందరినీ ఆకట్టుకునేలా 'బాలుగీత' సినిమా.. నవంబర్ 5 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్: నిర్మాత సుప్రియ యార్లగడ్డ సోషల్ మీడియా నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా బైనాన్స్ హ్యాక్ ఖండన.. క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్'.. భారీ వాచ్ టైమ్‌తో దూసుకుపోతున్న కామెడీ థ్రిల్లర్! రైలు ప్రమాదాల నేపథ్యంలో స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా ప్రజా నిరసనలతో సతమతమవుతున్న ఐరోపా ప్రభుత్వాలు ఐరోపా వ్యాప్తంగా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు లూలా గెలుపు: గ్లోబల్ సౌత్‌కు నిజమైన పరీక్ష *రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అడవిలోకి రెండో పులిని విడుదల చేసిన కజకిస్తాన్ హెబ్రోన్‌లో పైకప్పులపై సెటిలర్ల డేరా: పాలస్తీనియన్ల నిరసన ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో 'ఓం: చాప్టర్ 1'.. నవంబర్ 20న భారీ రిలీజ్! అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ. శంషొద్దీన్ పూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన

దుద్యాల, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం హకీంపేట గ్రామ శివారులో నవంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైతు మేళా, ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర బుధవారం పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంగణం, రైతు మేళా స్టాళ్లు, ట్రాఫిక్ నియంత్రణ పాయింట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, అప్రమత్తత, సమయపాలన పాటిస్తూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతు మేళా, ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై పోలీసు అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీసీఆర్బీ డీఎస్పీ జనయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేష్, కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, దుద్యాల ఎస్ఐ శ్రీశైలం, జిల్లా పోలీసు అధికారులు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.