BREAKING
అందరినీ ఆకట్టుకునేలా 'బాలుగీత' సినిమా.. నవంబర్ 5 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్: నిర్మాత సుప్రియ యార్లగడ్డ సోషల్ మీడియా నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా బైనాన్స్ హ్యాక్ ఖండన.. క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్'.. భారీ వాచ్ టైమ్‌తో దూసుకుపోతున్న కామెడీ థ్రిల్లర్! రైలు ప్రమాదాల నేపథ్యంలో స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా ప్రజా నిరసనలతో సతమతమవుతున్న ఐరోపా ప్రభుత్వాలు ఐరోపా వ్యాప్తంగా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు లూలా గెలుపు: గ్లోబల్ సౌత్‌కు నిజమైన పరీక్ష *రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అడవిలోకి రెండో పులిని విడుదల చేసిన కజకిస్తాన్ హెబ్రోన్‌లో పైకప్పులపై సెటిలర్ల డేరా: పాలస్తీనియన్ల నిరసన ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో 'ఓం: చాప్టర్ 1'.. నవంబర్ 20న భారీ రిలీజ్! అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ. శంషొద్దీన్ పూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం థియేటర్లలో 'మాయలేడి' మ్యాజిక్ ఖాయం.. నవంబర్ 13న గ్రాండ్‌గా విడుదల: హీరో రాకేష్ వర్రే

వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం

Select Suryaa Now
వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం

వెంకటాచలం,  మేజర్ న్యూస్  :   విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) డీన్ అకడమిక్ అఫైర్స్‌గా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆచార్య అందే ప్రసాద్ నియమితులయ్యారు. నవంబర్ 4న ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు అందజేయగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఆచార్య అందే ప్రసాద్ గతంలో వీఎస్‌యూ కళాశాల ప్రిన్సిపల్‌, రిజిస్ట్రార్‌, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్‌, ఐక్యూఏసీ డైరెక్టర్‌, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఐక్యూఏసీ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో విశ్వవిద్యాలయానికి ఎన్ ఎ ఎ సి  నుంచి 3.23 సి జి పి ఏ తో ఏ గ్రేడ్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఎన్ ఎస్ ఎస్  జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆచార్య అందే ప్రసాద్ అనుభవంతో విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు, పరిశోధనా రంగాల అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి. వీరారెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.