ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించాలి. ఎస్ ఐ.
కంబదూరు: మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలోని 15 ఎంపీటీసీ సెగ్మెంట్లలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎస్‌ఐ లోకేష్ కుమార్ కోరారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, మభ్యపెట్టడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి సహించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 144 సెక్షన్ నిబంధనలు పాటించాలని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దొంగ ఓట్లకు తావులేకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.