థియేటర్లలో 'మాయలేడి' మ్యాజిక్ ఖాయం.. నవంబర్ 13న గ్రాండ్‌గా విడుదల: హీరో రాకేష్ వర్రే
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలెంటెడ్ హీరోగా, ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న తాజా చిత్రం మాయలేడి. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశంకర్ దర్శకత్వం వహిస్తుండగా, మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాకేష్ వర్రే, ఈసారొక పక్కా కమర్షియల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలో హీరో మరియు నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఈ సారి కథ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ పెట్టానని తెలిపారు. మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, నిన్నే పెళ్లాడతా, ఖుషి వంటి క్లాసిక్ లవ్ స్టోరీల వైబ్ ఉన్న సినిమాలను తాను వ్యక్తిగతంగా ఎంతో మిస్ అవుతున్నానని, అలాంటి అద్భుతమైన జానర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోనే మాయలేడి సినిమాను తెరకెక్కించినట్లు ఆయన వెల్లడించారు. కేవలం యాక్షన్ సినిమాలే కాకుండా కుటుంబ సమేతంగా థియేటర్లలో కూర్చుని నవ్వుకుంటూ, ఎంజాయ్ చేసే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో గా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు ప్రశంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మ్యూజిక్‌కు, భావోద్వేగాలకు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు. నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్నామని, అందరూ థియేటర్లలో సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని హీరో రాకేష్ వర్రే పిలుపునిచ్చారు. ప్రచార చిత్రాలతోనే మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: నాగచైతన్య 'వృషకర్మ' నుంచి క్రేజీ అప్డేట్.. నవంబర్ 7న 'స్వాగ్ ఆఫ్ అర్జున్' ఫస్ట్ సింగిల్ రిలీజ్!