శభాష్ సునీత * తాడంగి సునీతకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అభినందనలు *
పాలకొండ, సూర్య : నగర పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనత పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందిన తాడంగి సునీత ను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివి ఎన్ మాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.పాలకొండ నగర పంచాయతీ లో 22వ వార్డు నుండి 196 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన బిజెపి కౌన్సిలర్ తాడంగి సునీత ను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు వి. మాధవ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు మిఠాయిలను తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె భర్త బత్తుల పవన్ సాయి నీ కోరారు.అనంతరం పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్ది శ్రీనివాసరావు ను తాడంగి సునీత, బత్తుల పవన్ సాయి మర్యాద పూర్వకం గా కలిశారు. శ్రీనివాసరావు సునీత ను అభినందించారు.పాలకొండ లో పార్టీ బలోపేతనికి కృషి చెయ్యాలన్నారు.