రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపికైన విద్యార్థి వార్వాళ్ళ అరుణ్ కుమార్
కుల్కచర్ల, మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జూడ్స్ పాఠశాలలో 30 జట్లతో జరిగిన పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఘన విజయం సాధించారు.ఆదర్శ పాఠశాల విద్యార్థి, కుల్కచర్ల గ్రామానికి చెందిన వార్వాళ్ళ.అరుణ్ కుమార్ కబడ్డీలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో పాటు 100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నాడు. అదే విధంగా వాలీబాల్లోనూ బాలికల జట్టు జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో విజేతలను,పిడి కృష్ణారెడ్డిని ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు.