BREAKING
వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తరలింపు ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం

 

*అర్హులైన పట్టభద్రులందరూ చివరి తేదీలోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి*

కడ్తాల్ రంగారెడ్డి  :

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో చివరి గడువులోపు నమోదు చేసుకోవాలని పట్టణ సర్పంచ్ రాయికంటి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతుగంటి శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్ తెలిపారు.

ఈ నేపథ్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత పూర్తి చేసిన పట్టభద్రులందరూ ఫారం-18 ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు గడువు త్వరలోనే ముగియనున్నందున చివరి రోజు వరకు వేచి చూడకుండా అర్హులైన వారందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ఫారం-18 దరఖాస్తు చేసుకోవడంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పొందాలని పిలుపునిచ్చారు.

ఓటరు నమోదు, ఫారం-18 దరఖాస్తు, అవసరమైన సూచనలు మరియు సందేహాల నివృత్తి కోసం క్యామ రాజేష్‌ను *9505207577* మొబైల్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, ఎండోమెంట్ డైరెక్టర్ యాదయ్య, వార్డు సభ్యులు మల్లయ్య, మంకి మహేష్, ముత్తి కృష్ణ, జాంగిర్ బాబా, కర్రోల రమేష్, కృష్ణవేణి, రాజు గౌడ్, జగన్ గౌడ్, మోతిలాల్, శివ నాయకులు గురిగళ్ళ లక్ష్మయ్య, ఎస్సీ సెల్ రామకృష్ణ, మంకీ శ్రీను, బుచ్చయ్య, ఎర్రోళ్ల శ్రీకాంత్, భరత్ యాదవ్, సత్యం, సాయిలు, రమేష్, రామకృష్ణ, శ్రీకాంత్, గంజి చంద్రశేఖర్, మహేష్, నరేష్, బాబు, సేవ్య తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మణ్ మేజర్ న్యూస్…