BREAKING
క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం ప్రశాంతంగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలు * మండలంలో 68.92 శాతం పోలింగ్ * వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తరలింపు ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ *

చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్

Select Suryaa Now
చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్

చీపురుపల్లి, సూర్య : చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మండలంలో మొత్తం ఓటర్లు 49, 469 మంది ఉండగా వారిలో 36,851 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఒక జెడ్పీటీసీ కి గురువారం 55 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. పీఓ ఏపిఓలు, ఓపీఓ లు కలిపి 425 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు. 
చీపురుపల్లి లో మహిళా ఓటర్లుదే హవా.....
చీపురుపల్లి నియోజకవర్గంలో మహిళా ఓటర్లుదే హవా కొనసాగింది. జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో చీపురుపల్లి లో 18,937 మంది,  గరివిడిలో 21,033 మంది, గుర్లలో 22,804 మంది, మెరకముడుదాం లో 16,327 మంది మహిళా ఓటర్లు పురుష ఓటర్లు కంటే ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతం కంటే మహిళల్లో పెరిగిన చైతన్యం ఏ పార్టీకి మేలు జరగనుందోనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యులు....
చీపురుపల్లి మండలంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ...
మండల కేంద్రంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సంరక్షణ శిబిరంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ రక్త పరీక్ష చేయించుకున్నారు. ఆయనతో పాటు డీఎస్పీ ఎస్ రాఘవులు, సిఐ జి శంకరరావు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు ఉన్నారు.