BREAKING
పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన ఎన్విడియాతో భాగస్వామ్యాన్ని విస్తరించిన బాక్స్ ఎం&ఎం క్యూ2 లాభం 25% జంప్: రూ. 4,588 కోట్లు దీపావళి వేడుకలు: చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు 77.33% నమోదైన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు. గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్ల తగ్గింపుల పర్వం క్యాంపస్ యాక్టివ్‌వేర్ క్యూ2 లాభం 21% జంప్ అన్నదాతలు, దళారులను నమ్మి మోసపోవద్దు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు! టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత పోరు: నోయెల్ టాటాపై మెహలీ మిస్త్రీ ప్రశ్నలు మానిరేవుపోలింగ్కేం ద్ర మూసివేత.. ఆందోళనలో ఓటర్లు. అమెరికాలో మూడో త్రైమాసికంలో భారీగా పెరిగిన శ్రామిక ఉత్పాదకత

ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు!

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు!

బాడంగి, సూర్య : బాడంగి మండలంలో గురువారం నిర్వహించిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని ఒక జడ్పీటీసీ, 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 50 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. మండలంలోని 39,899 మంది ఓటర్లకు గాను 27,431 మంది ఓటు వేశారు. వీరిలో 13,250 మంది పురుషులు, 14,181 మంది మహిళలు ఉన్నారు. దీంతో 68.75 శాతం పోలింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

ఎంపీటీసీ సెగ్మెంట్ల వారీగా పోలైన ఓట్లు
మండలంలోని 14 ఎంపీటీసీ సెగ్మెంట్లలో డొంకినవలసలో 1,618, రేజేరులో 2,150, బాడంగిలో 2,004, బొత్సవానివలసలో 2,026, గజరాయునివలసలో 1,881, గొల్లాదిలో 1,708, గుడెపువలసలో 1,997, కోడూరు-1లో 1,526, కోడూరు-2లో 1,628, కోటిపల్లిలో 2,506, ముగడలో 1,936, పాల్తేరులో 2,441, వాడాడలో 2,022, వీరసాగరంలో 1,988 ఓట్లు పోలయ్యాయి.
భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ బాడంగిలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ముగడ గ్రామంలో బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ (బుడా) చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. గురువారం రాత్రి 7 గంటల నివేదిక ప్రకారం మండలంలోని మొత్తం 50 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.