BREAKING
క్యాంపస్ యాక్టివ్‌వేర్ క్యూ2 లాభం 21% జంప్ అన్నదాతలు, దళారులను నమ్మి మోసపోవద్దు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు! టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత పోరు: నోయెల్ టాటాపై మెహలీ మిస్త్రీ ప్రశ్నలు మానిరేవుపోలింగ్కేం ద్ర మూసివేత.. ఆందోళనలో ఓటర్లు. అమెరికాలో మూడో త్రైమాసికంలో భారీగా పెరిగిన శ్రామిక ఉత్పాదకత కాళేశ్వరం మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ: మంత్రులకు సమగ్ర ప్రజెంటేషన్ మేయరమ్మ.....భార్గవమ్మ.... కాన్వా లేఆఫ్స్: 6 నెలల జీతం, మ్యాక్‌బుక్ గిఫ్ట్ నల్లసముద్రంలో కార్గో నౌకలపై దాడి నేపథ్యంలో పెట్రోలింగ్ విమానాల మోహరింపును పొడిగించిన ఫ్రాన్స్ క్యూ2 దెబ్బ: కమ్మిన్స్ ఇండియా 14% పతనం 10 కోట్ల యూరోల సైబర్ బ్యాంక్ దోపిడీ సాధారణ లుక్‌లో లూజుగా కనిపిస్తున్న మోహన్ లాల్: ఎల్ 368 షూటింగ్ లొకేషన్ స్టిల్స్ వైరల్ యూబీఎస్‌లో 200 ఉద్యోగాల కోత ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

భీమిలి నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలన.. కూటమి శ్రేణులకు కీలక సూచనలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు......!

Select Suryaa Now
భీమిలి నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలన.. కూటమి శ్రేణులకు కీలక సూచనలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు......!

ఆనందపురం, సూర్య : భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం, బోని, కృష్ణాపురం, లక్ష్మీపురం గ్రామాల్లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు నేరుగా వెళ్లి, ఓటింగ్ శాతం, పోలింగ్ నిర్వహణ తీరు, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళా ఓటర్లకు ప్రత్యేక సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా అధికారులకు పూర్తి సహకారం అందించాలని కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండి, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఓటర్లను ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పోలింగ్ ముగిసే వరకు ప్రతి బూత్ వద్ద సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.