ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి
పాలకొండ, సూర్య : పాలకొండ ఎక్సైజ్ స్టేషన్ ను డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి సందర్శించారు. రెవెన్యూ, కేసులపై సమీక్ష చేశారు. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లో ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాటు సారాయి తయారీ, రవాణా, అమ్మకాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భామిని సరిహద్దులో సారాయి నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.ఈ యన తో పాటు సిఐ సూర్య కుమారి, ఎస్సై లు పాల్గొన్నారు.