ఎం.రాజపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే జయకృష్ణ
పాలకొండ, సూర్య : వీరఘట్టం మండలంలోని ఎం.రాజపురం గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపుని చ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుం దని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలందరూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు.అలాగే వీరఘట్టం మండలం కత్తులాకవిటి స్వగ్రామం లో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఓటు హక్కు ను వినియెగించుకున్నారు.