రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్
రామభద్రపురం, సూర్య : మండల పరిధిలో నీ 14మండల ప్రాదేశికాలకు జిల్లా ప్రాదేశానికి గురువారం జరిగిన పోలింగ్ 74..60శాతం పోలింగ్ జరిగింది మొత్తం 38,820 ఓటర్లు ఉండగా 28 961మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగా పురుషులు 13753కాగా స్త్రీలు 15961మంది ఓటు హక్కును వినియోగించుకోగా మండలంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిపించేందుకు సంబంధిత అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 14ఎంపీటీసీ పరిధిలో గల గ్రామాల్లో ఓటర్లు కొన్నిచోట్ల బారులు దీ రి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్లను తీసుకొచ్చేందుకు ఎవరు వంతు వారు కృషిచేసి పోలింగ్ శాతాన్ని పెంచేది శ గా చర్యలు చేపట్టడం మరో విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎంపిటిసి ఎన్నికలు సజావుగా నడిపించిన సంబంధిత ఎన్నికల అధికారికి అధికార యంత్రాంగానికి పోలీసు వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.