*గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గంట్యాడ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట్యాడ మండలం గంట్యాడ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న గొప్ప ఆయుధమని, దానిని వృధా చేసుకోవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.