హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్....
జామి, సూర్య : జామి మండలంలోని జామి గ్రామంలో 22 నుంచి 37వ నంబరు వరకు గుర్తించిన హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గురువారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ సందర్శించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. హైపర్ సెన్సిటివ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.