జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి
విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పూసపాటిరేగ మండలం కుమిలి పోలింగ్ స్టేషన్ వద్ద భద్రత ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ ఐజిపి గోపీనాథ్ జట్టి పర్యవేక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి పోలింగ్ కేంద్రాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజిపి గోపీనాథ్ జట్టి సందర్శించి, భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. 100 మీటర్ల పరిధిలో ఓటర్ల మినహా మిగిలిన వ్యక్తులు ఎవ్వరూ ఉండకుండా చూడాలన్నారు. అనధికార వ్యక్తులను పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండకుండా చూడాలన్నారు. పార్టీ కండువాలు, గుర్తులు ధరించి పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలన్నారు. ఓటర్లను క్యూ లైన్లలో పంపాలని, ఓటు వేసిన తరువాత ఎవ్వరూ పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉండకుండా చూడాలని అధికారులను విశాఖపట్నం రేంజ్ ఐజిపి గోపీనాథ్ జట్టి ఆదేశించారు. ఐజీ వెంట భోగాపురం రూరల్ సిఐ ఎన్.శ్రీనివాసరావు ఉన్నారు.