గుడిపల్లిలో 80.75 శాతం పోలింగ్ నమోదు
35,539 ఓట్లకు గాను 28,697 ఓట్లు పోలింగ్ 13 సెగ్మెంట్లలో సజావుగా ఎన్నికలు.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేదు
గుడిపల్లి. మేజర్ న్యూస్ : గుడిపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 80.75 శాతం పోలింగ్ నమోదైంది. మండలవ్యాప్తంగా మొత్తం 35,539 ఓట్లు ఉండగా, వాటిలో 28,697 ఓట్లు పోలైనట్లు మండల ఎన్నికల అధికారి మల్లికార్జున వెల్లడించారు. మండలంలోని 13 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగి ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది.మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా గుడిపల్లి మండల ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో 13 సెగ్మెంట్లలోనూ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
సూర్య రిపోర్టర్: లెనిన్ బాబు, గుడిపల్లి మండలం