BREAKING
క్యూ2 దెబ్బ: కమ్మిన్స్ ఇండియా 14% పతనం 10 కోట్ల యూరోల సైబర్ బ్యాంక్ దోపిడీ సాధారణ లుక్‌లో లూజుగా కనిపిస్తున్న మోహన్ లాల్: ఎల్ 368 షూటింగ్ లొకేషన్ స్టిల్స్ వైరల్ యూబీఎస్‌లో 200 ఉద్యోగాల కోత ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర మహోత్సవం భీమిలి నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలన.. కూటమి శ్రేణులకు కీలక సూచనలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు......! ధనుష్, మమ్ముట్టి 'ఓం' చిత్రం నుంచి 'సెంచూధారే' సాంగ్ రిలీజ్: సినిమాపై భారీ అంచనాలు ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు సహకరించాలి రైతు మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఎం.రాజపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే జయకృష్ణ బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గార్మెంట్ కార్మికుల ఆందోళనలు ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి గుడిపల్లిలో 80.75 శాతం పోలింగ్ నమోదు సూర్య, జ్యోతిక ప్రేమ కథపై నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు: అన్యోన్యతకు అసలైన అర్థం వారేనంటూ ప్రశంసలు

రైతు మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

Select Suryaa Now
రైతు మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

దుద్యాల, మేజర్ న్యూస్:  కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం హకీంపేట లో  నవంబర్ 7 నుండి 9 వరకు నిర్వహించే రైతు మేళా, ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ  ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఇతర అధికారులతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రైతు మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.    రైతు మేళా నిర్వహించే ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేవిధంగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆయన తెలిపారు.  వీవీఐపీ, వీఐపీ, అధికారులు, మీడియా, జనరల్ పార్కింగ్ ఏర్పాటుతో  పాటు భోజన వసతులకు సంబంధించి వేరువేరుగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్  ఆదేశించారు.రైతు మేళాకు  అధికారికంగా ఇచ్చిన గుర్తిపు కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతు మేళాకు వచ్చే వారికి సభా స్థలికి సులభంగా చేరుకునే విధంగా రహదారుల వెంబడి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  రైతు మేళా ప్రాంగణంలో  త్రాగు నీరు కొరత లేకుండా సమృద్ధిగా ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతు మేళా ప్రాంగణంలో టాయిలెట్లు  ఏర్పాటుతో పాటు నవంబర్ 9న జరిగే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాల్లో టాయిలెట్లు, మంచినీటి సదుపాయాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.  
 రైతు మేళా సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖలైన వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, పశు సంవర్ధక , మత్స్య శాఖ ల ద్వారా ఏర్పాటు చేసే స్టాళ్ల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు, రైతులకు అధిక దిగుబడి వచ్చే పంటలపై అవగాహనతో పాటు తగు సూచనలు, సలహాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జడ్పీ సీఈఓ సుధీర్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.