BREAKING
సూర్య, జ్యోతిక ప్రేమ కథపై నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు: అన్యోన్యతకు అసలైన అర్థం వారేనంటూ ప్రశంసలు ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్.... ఫ్రాన్స్‌లో సుమారు 40 శాఖలను మూసివేయనున్న సోసైటీ జనరల్ సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు కారాడ గ్రామం ముందు విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు ఐసీసీ అక్టోబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలు ప్రకటన: రేసులో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ

పెట్టుబడుల పేరుతో మోసం - ఎల్‌ఐసీ ఏజెంట్ అరెస్ట్

Select Suryaa Now
పెట్టుబడుల పేరుతో మోసం - ఎల్‌ఐసీ ఏజెంట్ అరెస్ట్

సూర్య   బోయినపల్లి, నవంబరు 5.. అధిక లాభాలు వస్తాయని పెట్టుబడుల పేరుతో పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ రాపెల్లి ప్రవీణ్ కుమార్‌ను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు కోదురుపాకమరియు నీలోజిపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తుల నుంచి పెట్టుబడుల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడిపై బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కాగా, బోయినపల్లి ఎస్‌ఐ ఎన్. రమాకాంత్ నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా నిందితుడిపై రెండు కేసులు నమోదైనట్లు గుర్తించారు.
ఇదే విధంగా నిందితుడి చేత మోసపోయిన ఇతర బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.