వరద బాధితులకు బియ్యం, కూరగాయల -పంపిణీ చేసిన-కాసానిపద్మ చంద్ర మోహన్-ఉదయ్ జ్యోతి ప్రసాద్*
సూర్య అశ్వరావుపేట,అశ్వారావుపేట మండలంలోని కేసప్పగూడెం గ్రామం కే.సీ.ఆర్ కాలనీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇళ్లలోని నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు నీట మునగడంతో సుమారు 25 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం వరద ప్రభావిత కే.సీ.ఆర్ కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కాసాని చంద్రమోహన్–పద్మ, డా. భూక్యా ప్రసాద్–డా. ఉదయ జ్యోతి ఆధ్వర్యంలో 25 కుటుంబాలకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేసి తమ వంతు సహాయాన్ని అందించారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కేసప్పగూడెం సర్పంచ్ సోడెం భారతి, వార్డు సభ్యులు కొవ్వసి భారతి, సోయం వెంకటమ్మ, సున్నం పార్వతి, వేదాంతాపురం సర్పంచ్ సోడెం ముత్యాలరావు , పిల్లెం బొత్తయ్య , సొంధెం ముత్యాలరావు , సొంధెం కృష్ణ ,వేదాంతపురం మాజీ సర్పంచ్ సోమిని శివశంకర్ ప్రసాద్, అశ్వారావుపేట టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, గూడవర్తి వెంకటేశ్వరరావు, జజ్జురపు శ్రీరామమూర్తి, తగరం జగన్నాథం, శెట్టిపల్లి రఘురామ్, జక్కం బలరామకృష్ణ, రాజనాల గంగాధర్, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట