ఉపాధి పనుల్లో కూలీల హాజరు పెంచాలి
- లీడర్ ఛానల్ పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్
-ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండలంలో లీడర్ ఛానల్ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) చిన్న ఓబులేష్ సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు కూలీల హాజరు శాతాన్ని పెంచాలని ఎంపీడీవో వరుణ్ తేజ్, ఏపీవో పర్వతాలకు సూచించారు. కూలీలకు పనులు కల్పించడంతో పాటు పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో పర్వతాలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.