ఎన్నికల విధుల్లో విద్యార్థుల సేవలు అభినందనీయం!
లక్కవరపు కోట, సూర్య : మండలము లోఎంపీటీసీ , జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా కోట్యాడ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన సుభాష్ చంద్రబోస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యేక సేవలు అందించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తమ వంతు కృషి చేశారు. విద్యార్థుల సేవలను పలువురు అభినందించారు.