BREAKING
తె ర్లాం లో 72.28 శాతం పోలింగ్ జిడిపి లెక్కింపుల మార్పుతో దాదాపు 60 శాతం పెరిగిన ఇథియోపియా ఆర్థిక వ్యవస్థ దేశ ప్రగతిలో జర్నలిస్టుల సేవలు నిరుపమానం ఈ నగరానికి ఏమైంది 2 చిత్రంలో శ్రీనాథ్ మాగంటి భారీ సవాల్: పాత్ర మార్పుపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు 2023 తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించిన క్రిస్టియానో రోనాల్డో: శకం ముగిసిందన్న ఫుట్‌బాల్ ప్రపంచం వరద బాధితులకు బియ్యం, కూరగాయల -పంపిణీ చేసిన-కాసానిపద్మ చంద్ర మోహన్-ఉదయ్ జ్యోతి ప్రసాద్* ముడి పదార్థాలను నిల్వ చేసుకోవాలి..జర్మనీ నేత ఫ్రెడ్రిచ్ మెర్జ్ పిలుపు ఎన్నికల విధుల్లో విద్యార్థుల సేవలు అభినందనీయం! విశాఖలో ఆధునిక దంత వైద్య విప్లవానికి నాంది! ఉక్రెయిన్ శాంతి చర్చల్లో ఐరోపా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అండర్-19 ఆసియా కప్ 2026: మలేషియాపై 9 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ ---ప్రజా సమస్యల పరిష్కారమే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యం! ---ఖమ్మం కార్పొరేషన్ లో పొత్తు కుదిరితే కాంగ్రెస్తో ఉంటాం లేకపోతే సొంతంగా నిలబడతాం. ---ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం తప్పదు. ఐ.యు.ఏం.ఎల్.బలమైన శక్తిగా తెలంగాణలో తయారు చేస్తాం. --- మీడియా సమావేశం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్ భారత్ రెన్యూవల్ ఎనర్జీ సమ్మిట్‌లో ఉపరాష్ట్రపతి ఉద్ఘాటన బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు: అద్భుత శతకంతో కనీవిని ఎరుగని రీతిలో విండీస్‌ను ఆదుకున్న అమీర్ జాంగూ

ఎల్.కోటలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు!

Select Suryaa Now
ఎల్.కోటలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు!

లక్కవరపుకోట, సూర్య : లక్కవరపుకోట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలవ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 40 గ్రామాలకు సంబంధించి మొత్తం 53 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ చేపట్టారు.
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. చందులూరు, వీరభద్రపేట గ్రామాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో సమాచారం అందుకున్న ఎల్.కోట ఎస్‌ఐ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి సమస్యను సద్దుమణిగేలా చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలను అధికారులు సీసీ కెమెరాల నిఘా నీడలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఓటర్లు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమైంది. ఇక ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.