తె ర్లాం లో 72.28 శాతం పోలింగ్
తె ర్లాం, సూర్య : మండల పరిధిలో నీ 15 మండల ప్రాదేశికాలకు జిల్లా ప్రాదేశానికి గురువారం జరిగిన పోలింగ్ 72.28 శాతం జరిగింది మొత్తం 49 982 ఓటర్లు ఉండగా 36,123 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగా పురుషులు 17 ,719 కాగా స్త్రీలు 18 ,404 మంది ఓటు హక్కును వినియోగించుకోగా మండలంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిపించేందుకు సంబంధిత అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 15 ఎంపీటీసీ పరిధిలో గల గ్రామాల్లో ఓటర్లు కొన్నిచోట్ల బారులు దీ రి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్లను తీసుకొచ్చేందుకు ఎవరు వంతు వారు కృషిచేసి పోలింగ్ శాతాన్ని పెంచేది శ గా చర్యలు చేపట్టడం మరో విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎంపిటిసి ఎన్నికలు సజావుగా నడిపించిన సంబంధిత ఎన్నికల అధికారికి అధికార యంత్రాంగానికి పోలీసు వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.