BREAKING
జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి సోషల్ మీడియాలో రామాయణం సినిమా జోరు: రావణాసురుడిగా యశ్ నటనకు ఫిదా అయిన నెటిజన్లు పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ వయసు మీద పడినా.. ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత! బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ‘జైలర్ 2’: నవంబర్ 12న ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమా ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఇంట్రెస్టింగ్ డ్రామా పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై గీతం అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్ నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు* వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమా: కజకిస్థాన్‌లో భారీ యాక్షన్ మరియు స్పెషల్ సాంగ్ షూటింగ్ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Select Suryaa Now
రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ :ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు దాదాపు రూ. 9,100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 13 వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ. 46.08 కోట్ల వ్యయంతో పూర్తయిన పలు ప్రభుత్వ భవనాలను సీఎం జాతికి అంకితం చేయనున్నారు.

నవంబర్ 7 (శనివారం):

ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట వద్ద మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన అనంతరం ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కొడంగల్‌కు చేరుకుంటారు.

నవంబర్ 8 (ఆదివారం):

రెండో రోజు హకీంపేటలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ. 81 కోట్లతో నిర్మించనున్న 'ఎకోపామ్' పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో (రూ. 4 కోట్లు) నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలను, అలాగే రూ. 2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట పి.హెచ్.సి భవనాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం బొంరాస్‌పేటలో జూనియర్ కళాశాల (రూ. 4.79 కోట్లు), పోలీస్ స్టేషన్ (రూ. 3 కోట్లు); కొడంగల్‌లో పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ (రూ. 3.80 కోట్లు); దుద్యాలలో పోలీస్ స్టేషన్ (రూ. 3 కోట్లు), సమీకృత మండల కార్యాలయం (రూ. 12 కోట్లు) భవనాలను ప్రారంభిస్తారు.

కోస్గి మండలం నాచారం వద్ద రూ. 5,060 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ (కొత్తవాల్‌గూడ) నుంచి ఎన్‌హెచ్-167N (నాచారం) వరకు నిర్మించే 'రేడియల్ రోడ్డు–2' నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా కోస్గిలో సైన్స్ మ్యూజియం (రూ. 6 కోట్లు), దౌల్తాబాద్‌లో జూనియర్ కళాశాల (రూ. 4.79 కోట్లు), బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (రూ. 2.35 కోట్లు) భవనాలను సీఎం ప్రారంభిస్తారు. రాత్రికి కొడంగల్ నివాసంలో బస చేస్తారు.

నవంబర్ 9 (సోమవారం):

పర్యటన చివరి రోజు హకీంపేటలో ఏర్పాటు చేసే భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ తదితర 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.

కీలక శంకుస్థాపనలు & కేటాయింపులు (రూ. 9,053 కోట్లు):

 * రేడియల్ రోడ్డు-2: రూ. 5,060 కోట్లు

 * ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ (MNKLIS) 2వ దశ: రూ. 2,100 కోట్లు

 * బీటీ రోడ్ల నిర్మాణ పనులు (223 పనులు): రూ. 1,410 కోట్లు

 * విద్యా రంగం: 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు (రూ. 118.80 కోట్లు), కొడంగల్ వ్యవసాయ కళాశాల (రూ. 123 కోట్లు)

 * ఇతర అభివృద్ధి పనులు: కొడంగల్, కోస్గి, మద్దూరులలో ఆధునిక బస్టాండ్లు (రూ. 41.83 కోట్లు), మద్దూరు NAC સ્కిల్ సెంటర్ (రూ. 20 కోట్లు), డివిజనల్ కార్యాలయ సముదాయం (రూ. 20 కోట్లు), ఆధ్యాత్మిక ప్రాంతాల (గురులోక మసంద్ ప్రభు మందిరం, నిరంజన్ మఠం) అభివృద్ధికి దాదాపు రూ. 9.55 కోట్లు కేటాయించారు.