BREAKING
మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం

*ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు*

Select Suryaa Now
*ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు*    *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు*

మధిర, సూర్య మేజర్ న్యూస్.


కులమత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి బాటలో గ్రామ సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి కృషికి గుర్తింపు ఇల్లూరు ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన పీఎం ఏజేఏవై (పి యం -ఎ జె ఎ వై )అమలులో భాగంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు చేస్తున్న కృషిని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మధిర మండలంలోని ఆదర్శ గ్రామంగా ఇల్లూరుకు గుర్తింపు లభించడం గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. గ్రామ సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం తమ బాధ్యతను మరింత పెంచిందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇల్లూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇల్లూరును అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇల్లూరు గ్రామానికి ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించిన జిల్లా, మండల స్థాయి అధికారులకు, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మధిర మండలంలో నెంబర్ వన్ గ్రామంగా ఇల్లూరుకు గుర్తింపు లభించడం పట్ల సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ గ్రామంగా లభించిన గుర్తింపును నిలబెట్టుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.