జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
సీతానగరం, సూర్య : పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రాదేశిక(జడ్పిటిసి .ఎంపిటిసి) ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికతో కూడిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా సీతానగరం మండలం, నిడగల్లు, బూర్జ, బలిజిపేట మండలం, అజ్జాడ, చాకరపల్లి, చిలకలపల్లి, రావుపల్లి, అమ్పావల్లి, బలిజిపేట, చినమేరంగి, ఎం.ఆర్.నగరం* ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి గుంపులు గుమిగూడకుండా, రాజకీయ పార్టీల కార్యకలాపాల వల్ల ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సహా ప్రతి ఒక్కరికీ అవసరమైన సహకారం అందిస్తూ, వారు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని తెలిపారు. ఎన్నికల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా లో జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ నుంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉదయం నుంచి కూడా ప్రజలు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఏవిధమైన అవాంచనీయ ఘటనలు జరగకండా సజావుగా పోలింగ్ జరుగుతుందని . జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 900 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు, శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నం కాకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆ రూట్స్ లో కూడా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టి బృందాలు ఏర్పాటు చేసి ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా తిరుగుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజల భద్రతకు, ఎన్నికలు సజావు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ తో పాటుగా పోలీస్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.