సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన
ఆనందపురం, సూర్య : ఆనందపురం మండలంలో జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల్లో సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గౌరవ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు విస్తృతంగా పరిశీలించారు. ఈ రోజు గౌరవ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు ఆనందపురం మండలంలోని సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలైన సొంత్యం, గండిగుండం, గిడిజాల తదితర ప్రాంతాల్లో విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సమర్థవంతమైన బందోబస్తు నిర్వహణ, ముందస్తు నివారణ చర్యలు, సున్నితమైన ప్రాంతాలపై నిరంతర నిఘా, ఎన్నికలు ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.