BREAKING
చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై గీతం అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్ నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు* వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమా: కజకిస్థాన్‌లో భారీ యాక్షన్ మరియు స్పెషల్ సాంగ్ షూటింగ్ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ స్టంట్‌ఉమెన్ గీతా టాండన్‌కు చేదు అనుభవం: అనిల్ కపూర్, ఫరా ఖాన్ క్షమాపణలు ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి! సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన

స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

Select Suryaa Now
స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

పూసపాటిరేగ, సూర్య : మండలంలోని జడ్పిటిసి స్థానంతో పాటు ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లలో చైతన్య వెల్లువిరిసి ఉదయం ఏడు గంటలకే మండల కేంద్రమైన పూసపాటిరేగతో పాటు కుమిలి, రెల్లివలస, కుమిలి పోలింగ్ కేంద్రాలతో పాటు మత్స్యకార గ్రామాలైన చింతపల్లి, తిప్పలవలస, కోనాడ, బర్రిపేట, వెల్దురు పోలింగ్ బూత్ లలో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. వెల్దుర్లో రెండు పోలింగ్ కేంద్రాలు దగ్గర ఆనుకొని ఉండడంతో ఓటర్లు ఓట్లు వేసేందుకు నాన్న అవస్థలు పడ్డారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో పార్టీల నాయకులు వరుస క్రమంలో ఉన్న ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయగా పార్టీల మధ్య మాట మాట పెరిగి స్వల్ప ఘర్షణలకు చోటు చేసుకుంది. ఆ కేంద్రంలో ఒకే కానిస్టేబుల్ ఉండడంతో వారిని చెదరగొట్టడం ఒకంత ఇబ్బందికరంగా మారి ఎన్నికల నిర్వహణ కష్టతరంగా మారింది. ముందు కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో కొంతసేపు పోలింగ్ నిలిపివేసిన అధికారులు మరోసారి ఈ స్వల్ప ఘటన చోటు చేసుకోవడంతో సీఐ శ్రీనివాసరావు చొరవతో సిబ్బంది ప్రవేశించి పార్టీల నాయకులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రెల్లివలస జడ్పీ పాఠశాలలో ఇటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రం వద్ద ఉంటూ ఘర్ష కూటమి అభ్యర్థిణ లేకుండా ప్రత్యేక చొరవ చేపట్టారు. పోలింగ్ కేంద్రం సమీపంలో తెదేపా కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి తనయుడు తమ్మి నాయుడు పోలింగ్ కేంద్రం వద్ద ఉండే ప్రయత్నం చేయగా ముందు జాగ్రత్త చర్యగా సీఐ శ్రీనివాసరావు బయటకు పంపించే ప్రయత్నం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉంటే ఓటర్లను ప్రలోభ పెట్టే పరిస్థితి వస్తుందని, అవతల వారు కూడా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ తమ్మి నాయుడును పోలింగ్ కేంద్రం బయటకు పంపడంతో పాటు ఎన్నికలను సీఐ శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లయింది.