చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు
చేజర్ల, మేజర్ న్యూస్ : మండల కేంద్రమైన చేజర్లలో పలువురు కూటమి నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సల్మా షిరీన్, కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లీశ్వరి, మాజీ ఎంపీపీ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు భూదళ్ల వీర రాఘవ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్, చేజర్ల యూనిట్ ఇన్‌చార్జి రావి కృష్ణారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సోమవరపు హజరత్తయ్య తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.