పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ
వృద్ధురాలిని ఓటు వేయించేందుకు తీసుకెళ్లే క్రమంలో వివాదం.. కర్రలతో దాడి చేసుకునే స్థాయికి చేరిన ఇరువర్గాలు
ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండలం పెద్దమోదుగపల్లి గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య స్వల్ప వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ వృద్ధురాలిని ఓటు వేసేందుకు తీసుకెళ్లే క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం చెలరేగినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని, పరిస్థితి కర్రలతో కొట్టుకునే స్థాయికి చేరినట్లు తెలిసింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తికి తలకు గాయం కావడంతో వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనలో ఒక వ్యక్తికి తలపై గాయం కావడంతో చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.