BREAKING
స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ స్టంట్‌ఉమెన్ గీతా టాండన్‌కు చేదు అనుభవం: అనిల్ కపూర్, ఫరా ఖాన్ క్షమాపణలు ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి! సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన గుండెపోటుతో వ్యక్తి మృతి జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి

జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్

Select Suryaa Now
జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్

అనకాపల్లి, సూర్య :  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు 

అందజేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పై పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మొత్తం 12,21, 099 మంది తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ అడుగుతుందని ఉత్సాహంగా వాటర్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, జిల్లావ్యాప్తంగా 24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం1530  పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 10,345 మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ చేపట్టామని, సుమారు 2255  మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 381 అతి సమస్యాత్మక మరియు 465  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.