BREAKING
బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ‘జైలర్ 2’: నవంబర్ 12న ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమా ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఇంట్రెస్టింగ్ డ్రామా పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై గీతం అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్ నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు* వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమా: కజకిస్థాన్‌లో భారీ యాక్షన్ మరియు స్పెషల్ సాంగ్ షూటింగ్ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి

ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్

Select Suryaa Now
ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుండెకు హత్తుకునేలా అందమైన కథతో తెరకెక్కిన చిల్డ్రన్ మూవీ సమ్మర్ హాలిడేస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకర్ ప్రతిభావంతంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 6న సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా యువ నటులు రోహన్ మరియు అరుణ్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను, తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ చిత్రంలో తాను ఆర్.వి. అనే పాత్రలో నటించానని, ఆ క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుందని నటుడు అరుణ్ తెలిపారు. జీవితంలో ఎలాంటి పెద్ద సమస్యలు లేకపోయినా సంతోషం లేని ఆ అబ్బాయి జీవితంలోకి కె.వి. పాత్ర ప్రవేశించాక ఎలాంటి మార్పులు వస్తాయనేది సినిమాలో చూడాలని ఆయన సూచించారు. లెజెండరీ నటి జయసుధతో కలిసి నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఆమెతో ఉన్నప్పుడు నిజమైన అమ్మమ్మతో ఉన్న అనుభూతి కలిగిందని అన్నారు. నేషనల్ అవార్డు అందుకోవడం వెనుక తన తల్లి పడిన తపన, అందించిన ధైర్యమే ప్రధాన కారణమని అరుణ్ భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. షూటింగ్స్ సమయంలో అమ్మ అనారోగ్యంతో ఉన్నా ఆ విషయాన్ని దాచి తన వెంటే ఉండి ప్రోత్సహించిందని ఆయన తెలిపారు.

మరోవైపు ఈ చిత్రంలో కె.వి. అనే ఎనర్జిటిక్ పాత్రలో కనిపించబోతున్నానని నటుడు రోహన్ వెల్లడించారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురైనా అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ కుటుంబం కోసం కష్టపడే యువకుడిగా ఈ పాత్ర సాగుతుందని చెప్పారు. చదువుకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తానని, షూటింగ్స్‌ను మేనేజ్ చేస్తూనే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నానని ఆయన తెలిపారు. 90s వెబ్ సిరీస్ తర్వాత ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడే విభిన్నమైన పాత్ర చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఈ చిత్రంలో కామెడీతో పాటు సమానంగా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు సెకండాఫ్ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని రోహన్ పేర్కొన్నారు.

ధీరజ్ మొగిలినేని ప్యానేట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి చిన్ననాటి రోజులను, సెలవుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సింజిత్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఫన్, ఎమోషన్స్ మరియు చక్కటి కుటుంబ విలువలతో కూడిన ఈ సమ్మర్ హాలిడేస్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లలో కచ్చితంగా అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. నవంబర్ 6న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందింది.