BREAKING
తుఫాన్ బాధితులకు 2.5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ * సివిల్ సప్లై డిటి కె శ్రీవిద్య * రామాయణం సినిమాపై కరణ్ జోహార్ ప్రశంసల వర్షం: రణ్‌బీర్ కపూర్, యశ్ నటన అద్భుతమంటూ కితాబు జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి సోషల్ మీడియాలో రామాయణం సినిమా జోరు: రావణాసురుడిగా యశ్ నటనకు ఫిదా అయిన నెటిజన్లు పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ వయసు మీద పడినా.. ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత! బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ‘జైలర్ 2’: నవంబర్ 12న ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమా ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఇంట్రెస్టింగ్ డ్రామా పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై గీతం అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్ నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు*

పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ

Select Suryaa Now
పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ

విశాఖపట్నం, సూర్య :  జిల్లాలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి మండలాల పరిధిలో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళి, ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో సందీప్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ యోగిత తదితర అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల పరిస్థితులు, పోలింగ్ పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించారు. క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ ఎన్నికల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకతతో పోలింగ్ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను అమలు చేస్తూ పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.