BREAKING
తుఫాన్ బాధితులకు 2.5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ * సివిల్ సప్లై డిటి కె శ్రీవిద్య * రామాయణం సినిమాపై కరణ్ జోహార్ ప్రశంసల వర్షం: రణ్‌బీర్ కపూర్, యశ్ నటన అద్భుతమంటూ కితాబు జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి సోషల్ మీడియాలో రామాయణం సినిమా జోరు: రావణాసురుడిగా యశ్ నటనకు ఫిదా అయిన నెటిజన్లు పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ వయసు మీద పడినా.. ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత! బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ‘జైలర్ 2’: నవంబర్ 12న ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమా ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఇంట్రెస్టింగ్ డ్రామా పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై గీతం అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్ నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు*

జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి

Select Suryaa Now
జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి

విశాఖపట్నం, సూర్య : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరింత బలం చేకూరింది. ఈరోజు 35వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు గురజాపు రవి, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కార్పొరేటర్ శ్రీ జెర్రిపోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గురజాపు రవికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురజాపు రవి మాట్లాడుతూ.. దక్షిణ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసి, పార్టీకి ఘన విజయాన్ని అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రసాద్, జనసేన నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.