నూతన తహసీల్దార్‌కు మామిళ్లపల్లి సర్పంచి సన్మానం
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లెల స్వప్నను మామిళ్లపల్లి గ్రామ సర్పంచి ముకురాల మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ నాయక్, గణేష్ గౌడ్ పాల్గొన్నారు.