అచ్చంపేట సబ్ కలెక్టర్‌ను కలిసిన నూతన తహసీల్దార్
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లెల స్వప్న గురువారం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న పరిపాలనా అంశాలు, రెవెన్యూ సంబంధిత విషయాలపై సబ్ కలెక్టర్‌తో చర్చించారు. మండలంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులను వివరించారు.