ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు
గరుగుబిల్లి, సూర్య : మండలంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు గురువారం ఉదయం ఏడు గంటలకే ప్రారంభమయ్యాయి. ఎంపీటీసీ, జడ్పి టిసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైన కొద్ది సమయానికే మండ ల పరిధిలోని ఆయా గ్రామాలలో ఓటర్లు బారులు తీరారు.మండల పరిధిలోని గరుగుబిల్లి,రావివలస పెద్దూరు, కొత్తూరు,రావుపల్లి,గొట్టి వలస,ఉల్లిభద్ర,మరుపెంట,నాగూరు,బురదవెంకటాపురం, తోటపల్లి తదితర గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల పరిధిలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 49 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను నిర్వహించా రు.13 ఎంపీటీసీ స్థానాలను ఆరు రూట్లు మూడు జోన్లుగా విభజించడం జరిగిందని మండల రిటర్నింగ్ అధికారి ఎం వాణిశైలజ వెల్లడించారు.ఎన్నికల విధుల్లో 59 మంది పీవోలు, 59 మంది ఏపీవోలు తోపాటు 210 మంది ఓపిఓ లు విధులు నిర్వహించడం జరిగింద న్నారు.గురువారం జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి 64.11% శాతం పోలింగ్ నమోదయిం దని తెలిపారు.మండలం మొత్తం 38 959 మంది ఓటర్లకు గాను 24,978 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు. మండల ఉప ఎన్నికల అధికారులు నడిమింటి సూర్యనారాయణ,పాము బాల ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రా లను పరిశీలించారు.ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేలా స్థానిక ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో గట్టు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా నాగూరు గ్రామంలో రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమo మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూదనరావు,మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అక్కేన జగదీశ్వరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.