BREAKING
పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన ఎన్విడియాతో భాగస్వామ్యాన్ని విస్తరించిన బాక్స్ ఎం&ఎం క్యూ2 లాభం 25% జంప్: రూ. 4,588 కోట్లు దీపావళి వేడుకలు: చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు 77.33% నమోదైన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు. గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్ల తగ్గింపుల పర్వం క్యాంపస్ యాక్టివ్‌వేర్ క్యూ2 లాభం 21% జంప్ అన్నదాతలు, దళారులను నమ్మి మోసపోవద్దు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు! టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత పోరు: నోయెల్ టాటాపై మెహలీ మిస్త్రీ ప్రశ్నలు మానిరేవుపోలింగ్కేం ద్ర మూసివేత.. ఆందోళనలో ఓటర్లు. అమెరికాలో మూడో త్రైమాసికంలో భారీగా పెరిగిన శ్రామిక ఉత్పాదకత

మేయరమ్మ.....భార్గవమ్మ....

Select Suryaa Now
మేయరమ్మ.....భార్గవమ్మ....

(విజయనగరం బ్యూరో, సూర్య)
ఇప్పుడు ఈ పేరు టౌన్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో ఆమె అనూహ్యంగా అత్యధిక మెజార్టీతో బలీయమైన ప్రత్యర్థి కోలగట్ల శ్రావణిని ఓటమి పాల్జేసి మేయర్ గా మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదేమి అంత తేలికగా వచ్చిన పదవి ఏమాత్రం కాదు. ఆమె భర్త అవనాపు విజయ్ దశాబ్ద కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసిన దానికి ఫలితం అని చెప్పక తప్పదు. మేయర్ గా ఎన్నికైన అవనాపు భార్గవి "మేజర్ న్యూస్ ప్రతినిధి" ( నేటి దినపత్రిక సూర్య) ప్రత్యేక ఇంటర్వ్యూలో తన స్వగతాలను పంచుకున్నారు. తగరపువలస కు చెందిన అవనాపు భార్గవి విజయనగరానికి చెందిన అవనాపు విజయ్ బాబుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనీషా, సుజయ్ బాబు పిల్లలు కాగా, భార్గవి తండ్రి తగరపువలసకు చెందిన నల్లి రవి కిరణ్, తల్లి ఆరి లక్ష్మి. ఆమె అక్క రేష్మి. తమ్ముడు యక్షిత్. ఆమె ప్రాథమిక విద్య భీమిలిలోని కేథలిన్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. రఘు కళాశాలలో ఉన్నత విద్యను, ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె కన్నవారిది ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం. వ్యాపార, వాణిజ్య రంగంలో తగరపవలసలో ప్రముఖ వ్యక్తులుగా ఉన్నారు. ఆమె నాన్నగారి ఆధ్వర్యంలో  తగరపువలసలో అత్యంత అద్భుతంగా పదేళ్లకోసారి ఉత్సవాలు జరిపిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆమెకు వివాహమైన అనంతరం విజయ్ బాబు నెరుపుతున్న రాజకీయాలను దగ్గరుండి పరిశీలించారామె. అదే ఆమె రాజకీయ ఆరంగేట్రానికి స్ఫూర్తినిచ్చిందని ఆమె తెలిపారు. ఎప్పటికైనా అవకాశం వస్తే పదవిని చేపట్టి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న భావనతో ఆమె ఉండేవారు. అనునిత్యం రాజకీయ వేదికగా ఉన్న ఆమె కుటుంబం ఒకవైపు, పిల్లల సంరక్షణ మరోవైపు చూసుకుంటూ బిజీగానే గడిపారు. ఇప్పుడు మేయర్ పదవి వరించడంతో ఆమెకు నగర బాధ్యత కూడా తోడైంది. అయినా గాని అన్ని బాధ్యతలను నెరవేర్చిన తాను నగర పౌరుల బాగోగులను కూడా సమర్థవంతంగా నిర్వహించగలనన్న ధీమాను వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికంగా ఎన్నో పూజా కార్యక్రమాలలో ఆమె పాల్గొనడం తనకిష్టంగా చెబుతూ ఉంటారు. భక్తి భావం మెండుగా ఉండటం వలన దైవక్రతులు శ్రద్ధలతో చేస్తూ ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. రుచికరమైన వంటలు చేయడం, టీవీల్లో సినిమాలు చూడడం దినచర్యలో భాగమని ఆమె చెప్పారు. కార్యకర్తలకు అండగా, ప్రజలకు తోడుగా ఎల్లప్పుడూ ప్రజా సేవకు అంకితమై ఉంటానని ప్రతిన చేశారు. స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు గారి అడుగుజాడల్లో, ఆమె సూచనలు, సలహాలతో నగర పాలన చేపడతానని స్పష్టం చేశారు.