BREAKING
క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం ప్రశాంతంగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలు * మండలంలో 68.92 శాతం పోలింగ్ * వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తరలింపు ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ *

ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి

ఆళ్లగడ్డ జెడ్పీటీసీగా రికార్డు మెజార్టీతో గెలుస్తా!
రాజశేఖర్‌రెడ్డి ధీమా
--ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా శ్రీరామరక్ష
--మండలంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలూ కూటమి ఖాతాలోనే..
---కార్యకర్తలు, ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ----ఆళ్లగడ్డ జెడ్పీటీసీ తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ మండలంలో తెదేపా-కూటమి విజయదుందుభి మోగించడం ఖాయమని, తాను జెడ్పీటీసీ అభ్యర్థిగా రికార్డుస్థాయి అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నానని తెదేపా నాయకుడు పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయనమేజర్ న్యూస్ తో వివరంగా మాట్లాడారు. మండలంలో ఎన్నికల సరళి, ప్రజల స్పందనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
*అభివృద్ధి-సంక్షేమానికే ప్రజామోదం*
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలే తమకు విజయాన్ని కట్టబెట్టబోతున్నాయని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబునాయుడి మార్గదర్శకత్వంలో జరుగుతున్న పరిపాలనపై ప్రజల్లో చెక్కుచెదరని విశ్వాసం ఉందని, ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి సైకిల్ గుర్తుకు ఓటు వేశారని పేర్కొన్నారు.
*ఎంపీటీసీలన్నీ కూటమి వశం*
మండలంలోని జెడ్పీటీసీ స్థానంతో పాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను, అడ్డంకులను ప్రజలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం గ్రామీణాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమికి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
*నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు*
ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు  శ్రమించిన తెదేపా, జనసేన, భాజపా నాయకులకు, శ్రేణులకు, అలాగే తమపై నమ్మకంతో ఓటేసిన ఆళ్లగడ్డ మండల ఓటర్లందరికీ ఈ సందర్భంగా పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపొందిన తర్వాత ఆళ్లగడ్డ మండలాన్ని అన్ని రంగాల్లో మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా