ప్రశాంతంగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలు * మండలంలో 68.92 శాతం పోలింగ్ *
పాచిపెంట, సూర్య : మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చక్కగా నిర్వహించారు. పాచిపెంట మండలంలో 68.92 శాతం పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి వి రాధాకృష్ణ విలేకరులకు తెలియజేశారు. మండలంలో ఓటర్లు 37, 504 మంది ఉండగా అందులో 25,849 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు, ఒక జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఎంపీడీవో బివిజే పాత్రో ఉన్నారు. గతంలో కంటే ఈసారి స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ఎన్నికలపై ఆసక్తి కనబరచలేదు. గత ఐదేళ్ల క్రితం 75% పైగా పోలింగ్ జరగగా ఈసారి దానికంటే తక్కువగా జరగడం గమనార్హం. శనివారం జరగబోయే ఓట్లు లెక్కింపు లో ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చక్కగా నిర్వహించారు. పాచిపెంట మండలంలో 68.92 శాతం పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి వి రాధాకృష్ణ విలేకరులకు తెలియజేశారు. మండలంలో ఓటర్లు 37504 మంది ఉండగా అందులో 25849 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు, ఒక జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఎంపీడీవో బివిజే పాత్రో ఉన్నారు. గతంలో కంటే ఈసారి స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ఎన్నికలపై ఆసక్తి కనబరచలేదు. గత ఐదేళ్ల క్రితం 75% పైగా పోలింగ్ జరగగా ఈసారి దానికంటే తక్కువగా జరగడం గమనార్హం. శనివారం జరగబోయే ఓట్లు లెక్కింపు లో ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.