BREAKING
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్ ఐరోపాలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు! ఎయిమ్స్ అవంతిపొరా పనులపై జేపీ నడ్డా సమీక్ష నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి అదానీ పోర్ట్స్ భారీ గ్లోబల్ డీల్: ఎవోస్ కొనుగోలు ట్రంప్ మీడియా షేరు భారీ పతనం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం ప్రశాంతంగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలు * మండలంలో 68.92 శాతం పోలింగ్ * వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి

Select Suryaa Now
ఎమ్మెల్యేకు  కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి

ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ , 15వ వార్డు కార్పొరేటర్ గా ఒమ్మి అప్పలరాజు  గెలిచిన సందర్బంగా తూర్పు శాసనసభ్యులు   వెలగపూడి రామకృష్ణ బాబు ని కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు,  మాజీ కార్పొరేటర్, రాష్ట్ర ఆర్గనైజింగ్  కార్యదర్శి ఒమ్మి సన్యాసిరావు   మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సత్కరించారు.   తనను గుర్తించి తనపై నమ్మకం తో కార్పొరేటర్ అభ్యర్థి గా టీడీపీ పార్టీ నుండి  సీటు ఇప్పించి, విజయానికి అన్ని విధాలుగా సహకారం అందించినందుకు   హృదయపూర్వక ధన్యవాదాలు   తెలియజేశారు.  అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభి రామ్ ని  కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు, వార్డ్ ఇంచార్జి గాడి సత్యం, పార్లమెంట్ సెక్రటరీ ఒమ్మి పోలరావు, నాయకులు రాపర్తి గణపతి, బిసపు కనకరాజు, మొల్లి అనిల్, మొల్లి పోలిరాజు పాల్గొన్నారు.