పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు!
గరుగుబిల్లి, సూర్య : అత్తవారింటికి వెళ్లే కారును కాస్త పక్కన పెట్టి,పెళ్లి పట్టుచీర, ఒంటి నిండా నగలు, తలలో పూలతో ముస్తా బైన పెళ్లికూతురు గెటప్‌లోనే నేరుగా స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఆమెను ఆరూపంలో చూసిన తోటి ఓటర్లు,పోలింగ్ అధికారులు ఒక్కసారి గా ఆశ్చర్యపోయారు.క్యూలైన్‌లో నిలబడి,ఏమాత్రం తడుముకోకుండా తన ఓటు హక్కును వినియోగించు కుంది. ప్రజాస్వామ్య పండగలో ఓటు హక్కుకు ప్రాధాన్యతనిస్తూ నవవధువు గొట్టిపిల్లి వాణి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది.నాయ కులను ఎన్నుకునేందుకు,మన భవి ష్యత్తును మార్చుకునేందుకు ఐదేళ్ల కొకసారి వచ్చే ఈఅవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిరూపించింది గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన నవవధువు గొట్టిపిల్లి వాణి.తన జీవితంలోనే ఎంతో కీలక మైన వివాహ వేడుక జరుగుతున్నా, అత్తగారింటికి ప్రయాణమయ్యే ఆ హడావిడిలోనూ తన పౌర బాధ్యతను మరువలేదు.ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ రోజున పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసి,అందరికీ ఆదర్శంగా నిలి చింది.గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన గొట్టిపిల్లి వాణికి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే వివాహం ఘనంగా జరిగింది.పెళ్లి ఆనందంలో మునిగి పోకుండా, ప్రజాస్వామ్యానికి ఓటు వేయడమే మొదటి కర్తవ్యమని భావించింది.ఓటు హక్కు వినియోగిం చుకున్న అనంతరం పెళ్లి వేడుక కోసం జిఎంవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా నవ వధువు గొట్టిపిల్లి వాణి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన రోజున నా వివాహం జరుగుతున్నందున నా పుట్టిన ఊరిలో నాకున్న ఓటు హక్కును వినియోగిం చుకున్నాను.ఐదేళ్లకు ఒకసారి మా ఊరిని పాలించే నాయకుడిని ఎన్ను కునే ఈఅవకాశాన్ని వదులు కోకుండా తన ఓటు హక్కును వినియోగించు కోవడం జరిగిందన్నారు.ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఈఅవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని నిరూపించింది నవ వధువు గొట్టిపిల్లి వాణి.ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ రోజున పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది.