BREAKING
అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్ ఐరోపాలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు! ఎయిమ్స్ అవంతిపొరా పనులపై జేపీ నడ్డా సమీక్ష నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి అదానీ పోర్ట్స్ భారీ గ్లోబల్ డీల్: ఎవోస్ కొనుగోలు ట్రంప్ మీడియా షేరు భారీ పతనం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం

నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్

Select Suryaa Now
నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్
నగరం, మేజర్ న్యూస్: 
నగరం మండలంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు మండల వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలో 42,477 మంది ఓటర్లు ఉండగా 30,394 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది, జడ్పిటిసి స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కారంకివారిపాలెం, లుక్కావారిపాలెం బూత్ లలో వైసిపి ఏజెంట్లను బయటికి పంపి రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ అద్దంకివారిపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యుడు లుక్కా బాపనయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిగిలిన చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అత్యధికంగా బోరమాదిగపల్లి సెగ్మెంట్లో 77.90 శాతం ఓట్లు పోల్ కాగా, అత్యల్పంగా ధూళిపూడి నార్త్ సెగ్మెంట్లో 65.99 శాతం ఓట్లు పోలయ్యాయి.
సెగ్మెంట్ వారీగా పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి:
పూడివాడ సెగ్మెంట్ 68.73 శాతం, అల్లపర్రు సెగ్మెంట్ 68.55 శాతం, ఏలేటిపాలెం సెగ్మెంట్ 73.08 శాతం, ధూళిపూడి నార్త్ సెగ్మెంట్ 65.99 శాతం ఓట్లు పోలయ్యాయి. చినమట్లపూడి సెగ్మెంట్ 73 శాతం, బోరమాదిగపల్లి సెగ్మెంట్ 77.90 శాతం, అద్దంకివారిపాలెం సెగ్మెంట్ 66.15 శాతం, పెద్దవరం సెగ్మెంట్ 68.58 శాతం, పెదపల్లి సెగ్మెంట్ 71.88 శాతం ఓట్లు పోలయ్యాయి. పెదమట్లపూడి సెగ్మెంట్ 75.68 శాతం, మంత్రిపాలెం సెగ్మెంట్ 67. 25 శాతం, కొలగానివారిపాలెం సెగ్మెంట్ 77.20 శాతం, నగరం సెగ్మెంట్ 75.98 శాతం, ఈదుపల్లి సెగ్మెంట్ 72.70 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణ, మండల తహశీల్దార్ జి. నాంచారయ్య, ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, రేపల్లె పట్టణ సీఐ అశోక్ కుమార్, ఎన్నికల ప్రత్యేక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్య, సబ్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్, ఇతర సిబ్బంది కృషి చేశారు.