ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి
సూర్య - పెద్దపల్లి : ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చట్టపరమైన అంశాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని సూచించారు. అనంతరం వీబీజీ రామ్‌జీ పథకం కింద మంజూరైన గ్రామాల్లో వీవో భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ సామగ్రి, నిధులను పథకం నిబంధనల ప్రకారం వినియోగించాలని, పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ కాలిందిని, డీసీఓ శ్రీమాల, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.